Home వార్తలు తెలంగాణ ఏ పథకం చూసిన గందరగోళం !!

ఏ పథకం చూసిన గందరగోళం !!

0

ఏ పథకం చూసిన గందరగోళం !!

రుణమాఫీ – రైతు భరోసా – భూమిలేని కూలీలకు సహాయం శూన్యం

న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరకాలం గడిచినా కూడా ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని టిఆర్ఎస్ పార్టీ వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి ఆరోపించారు, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాయ మాటలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముక్కు పిండి ముక్కు నేలకు రాపిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించడం వల్లనే వ్యవసాయం పండుగ అయిందని ఎక్కడ చూసినా వరి పంట రైతుల పండించి ప్రభుత్వానికి ఇచ్చిన కూడా సకాలంలో సన్న బియ్యం పంపిణీ చేయలేకపోతుందని అంతేకాక ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటికి చేయలేదని కేవలం కొంతమందికి మాత్రమే పూర్తిచేసి సంపూర్ణంగా రుణమాఫీ చేసినట్లు చెప్పడం రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు, 2 లక్షల పైన అప్పు కలిగిన రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారని ఆయన ప్రశ్నించారు, వీటితోపాటు రైతు భరోసా పథకం కూడా సంక్రాంతి పండుగకు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడపడం తప్ప సంక్రాంతి పండుగకు కూడా రైతు భరోసా నిధులు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని శాటిలైట్ ఉపగ్రహాల ద్వారా రైతుల చరిత్రను కష్టానికి ఈ ప్రభుత్వం చూడడం బాధాకరమని ఆయన అన్నారు, ఉపగ్రహాల ద్వారా వ్యవసాయం చేసిన రైతులను గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు, అంతేకాక భూమిలేని నిరుపేద కూలీలకు డిసెంబర్ 28న 6000 రూపాయలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు జమ చేయలేదని నిరుపేద భూమిలేని కూలీలను ఈ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించలేదని అలాంటి ప్రభుత్వం మళ్లీ మోసం చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు, దీనితోపాటు ఉచిత ఆరు గ్యారెంటీ పథకాలను కూడా అమలు చేయలేదని, ఎక్కడ చూసినా గ్రామాలలో పట్టణాలలో అభివృద్ధి కుంటుపడిపోతుందని నిధులు మంజూరు చేయక గ్రామాలలో గ్రామపంచాయతీ కార్మికులు రోడ్లపై కి వచ్చే ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ పథకం కూడా అమలు చేయకుండా సమీక్షలు సమావేశాల పేరుతో కాలయాపన చేయడం తప్ప చెప్పిన మాట ప్రకారం ఏ ఒక్క రోజు కూడా ఏ పథకం కూడా ఇప్పటికి అమలు కాలేదని అన్నారు, డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం నాటికి అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఒకటి కూడా అమలు చేయలేదని ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. (Story : ఏ పథకం చూసిన గందరగోళం !!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version