కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్స బ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1కోటి 63 లక్షల మంజూరు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సమర్పించిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు స్పందించి ఉపకేంద్ర నిర్మాణానికి సంబంధించి రూ 1 కోటి 63 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం GO RT NO 345″ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖ మాత్యులు మల్లు భట్టి విక్రమార్క కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణంతో కర్నే తాండ లిఫ్ట్ ప్రారంభమవుతుందని దాంతో
ఖిల్లా ఘనపూర్ లోని జంగమ్మయాపల్లి,దొంతికుంటా తండా కర్నె,తండా షాపుర్, మామిడామాడా, లట్టుపల్లి లోని 6 తాండలకి 4400 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందజేయవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఈ ఉపకేంద్ర నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేయడానికి కృషిచేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ కి, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కి, పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి కి, ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్స బ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1కోటి 63 లక్షల మంజూరు)