Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ మున్సిపాలిటీని ఆ దేవుడే గాడిలో పెట్టాలి

వినుకొండ మున్సిపాలిటీని ఆ దేవుడే గాడిలో పెట్టాలి

0

వినుకొండ మున్సిపాలిటీని ఆ దేవుడే గాడిలో పెట్టాలి

మున్సిపల్ చైర్మన్ దస్తగిరి

న్యూస్ తెలుగు/ వినుకొండ : మున్సిపల్ అధికారులు అనవసరపు ఖర్చులు పెడుతూ మున్సిపాలిటీని నాశనం చేస్తున్నారని, ఇక మున్సిపాలిటీని ఆ దేవుడే కాపాడాలంటూ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.. సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో, సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగింది.. కాగా అజెండాలోని 29 అంశాల్లో 14, 10, 23, 24, 26, 27 కొందరు కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలుపగా వాటిని వాయిదా వేస్తూ మిగతా అంశాలన్నింటినీ కౌన్సిల్ ఆమోదించినట్లు చైర్మన్ దస్తగిరి ప్రకటించారు. ఇక చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ. మొత్తం 32 మంది సభ్యులు ఉండగా పూర్తిస్థాయిలో రాకపోవటాన్ని అసహనం వ్యక్తం చేస్తూ సభ్యులంతా వచ్చి ఆయా అవార్డుల సమస్యలు తమ దృష్టికి, అధికారులు దృష్టికి తెస్తే కదా అభివృద్ధి జరిగేది అంటూ ప్రశ్నించారు. అలాగే మున్సిపల్ అధికారులు సమన్వయ లోపంతో అనవసరపు ఖర్చులు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చైర్మన్ అధికారులపై మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం జాషువా కళా ప్రాంగణంలో పెట్టకుండా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆర్భాటంగా ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు చెల్లింపులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పన్ను రూపంలో సాలీనా 6 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారని అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మున్సిపాలిటీ ఆరు కోట్లు చెల్లిస్తున్నదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అనవసరపు ఖర్చులు ఆపివేయాలని చైర్మన్ సూచించారు. ఇక పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా అవి చేపట్టకుండా డివైడర్లపై పూల కుండీలంటూ అజెండాలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అలాగే స్థానిక ఎన్ఎస్పి కాలువ ఇరువైపులా గ్రీనరీ ఏర్పాటుకు భారీ ఖర్చులు అజండా లో పొందుపరచడంపై వైస్ చైర్మన్ బి గాబ్రియేలు అభ్యంతరం తెలిపారు. ఇలా పలు వార్డుల్లో అనవసరపు ఖర్చులు అజెండాలో చూపటంపై పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపగా దానికి సంబంధించిన ఆరు అంశాలను రద్దు చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ సమావేశంలో డి ఈ. విష్ణుమూర్తి, మేనేజర్ వెంకట్రామయ్య, ఏఈ. ఆదినారాయణ, టీపీఎస్. వెంకట్ రావమ్మ పాల్గొన్నారు. (Story : వినుకొండ మున్సిపాలిటీని ఆ దేవుడే గాడిలో పెట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version