Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బొల్లాను విమ‌ర్శించే నైతిక హ‌క్కు మ‌క్కెన‌కు లేదు

బొల్లాను విమ‌ర్శించే నైతిక హ‌క్కు మ‌క్కెన‌కు లేదు

0

బొల్లాను విమ‌ర్శించే నైతిక హ‌క్కు మ‌క్కెన‌కు లేదు

న్యూస్ తెలుగు/వినుకొండ : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే ఇటీవల ఎన్నికలలో టిడిపిలో చేరిన మక్కెన మల్లికార్జున రావు కి లేదని వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు.. విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని. విమర్శిస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు మక్కెన మల్లికార్జునరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బొల్లాపై విమర్శలు గుప్పించారు.. దీంతో స్పందించిన వైసీపీ నేతలు ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీనియర్ న్యాయవాది వైసిపి లీగల్ సెల్ బాధ్యులు ఎం ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ. ఆనాడు వైయస్సార్ పుణ్యమా అంటూ అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మక్కెన 2004లో ఎమ్మెల్యేగా గెలిచి మరల టికెట్ రాకపోగా, అలాగే 2014 ఎన్నికలలో మరల పోటీ చేసిన మక్కెనకు కేవలం 5 వేల 779 ఓట్లు మాత్రమే వచ్చాయని.. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా గెలవడం, ఇటీవల జరిగిన ఎన్నికలలో బొల్లా ఓడినప్పటికీ లక్ష ఓట్లు వచ్చాయని. దీన్ని మక్కెన మర్చిపోయి బొల్లాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎంఎన్ అన్నారు. కాగా ఎన్నికల జరిగి ఆరు నెలలైంది బొల్లా వినుకొండ రావటం లేదు అని మక్కెన అనడాన్ని వైసీపీ నాయకులు తప్పు ఆయనకు ఉన్న వ్యాపారాల కారణంగా రాలేకపోయారని. బ్రహ్మనాయుడు ఇక పూర్తిస్థాయిలో వినకొండ ప్రజలకు అండగా ఉంటారన్నారు. బొల్లా ఐదేళ్ల ఎమ్మెల్యే పాలనలో ప్రతిరోజు వినుకొండ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.. రాజకీయాలను ప్రత్యర్ధులుగా చూడాలే తప్ప బద్ద శత్రువులుగా చూడకూడదని వారు మక్కెనకు హితవు పలికారు. కాగా భూ దందాలు ఆక్రమణల గురించి మక్కెన మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని వైసీపీ నేతలు అన్నారు. మక్కెన పాలన హయాంలో
.. స్వల్ప ధరలకు భూములు స్వాధీనం చేసుకోవడం. ఓ సామాజిక వర్గ బడా వ్యాపారులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం మక్కెనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎం ఎన్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. బొల్లా ఎమ్మెల్యేగా చేసిన సమయంలో త్రాగునీటి ఎద్దడి పరిష్కరించటం. పట్టణంలో ఆక్రమణలు తొలగించి పౌరులకు లింకు రహదారులు ఏర్పాటు చేయడం. కోట్ల విలువైన ఎన్ఎస్పి స్థలాన్ని మున్సిపాలిటీకి బదలాయించడం. స్థానిక స్థానిక ఎన్ఎస్పి కాలువ ఇరువైపులా సిమెంటు రోడ్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించాలని బొల్లా చేసిన అభివృద్ధి మక్కెనకు కనిపించలేదా అని వైసిపి నేతలు ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, దండు చెన్నయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బి. గాబ్రియేలు పాల్గొన్నారు. (Story : బొల్లాను విమ‌ర్శించే నైతిక హ‌క్కు మ‌క్కెన‌కు లేదు) 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version