Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ పీఎస్‌లో డిఎస్పి త‌నిఖీలు

వినుకొండ పీఎస్‌లో డిఎస్పి త‌నిఖీలు

0

వినుకొండ పీఎస్‌లో డిఎస్పి త‌నిఖీలు

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డ్స్ ను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ రేటు తగ్గినందుకు మరియు ఇటీవల జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారమందు పల్నాడు జిల్లాలో వినుకొండ పోలీస్ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచినందుకు సి. ఐ , ఎస్. ఐ మరియు సిబ్బందిని అభినందించారు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రారంభించిన మీతో – మేము కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన వర్టికల్ టీవీ, సైబర్ నేరాల గురించి మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వినుకొండ పట్టణ మరియు మండల ప్రజలకు, పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలసిందిగా చెప్పి స్టేషన్ యందు మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ప్రజలతో సక్రమంగా మెలుగుతూ సమస్యలను సత్వరమే స్వీకరించి పరిష్కారం చేయవలసిందిగా సూచించడం జరిగింది. రెండు మరియు అంతకన్నా ఎక్కువ క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయమని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరుచుకోవాల్సిందిగా పలు సూచనలు చేశారు. (Story : వినుకొండ పీఎస్‌లో డిఎస్పి త‌నిఖీలు) 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version