ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ప్రజలకు
మెరుగైన సేవలు అందించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శనివారం వీపనగండ్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఓపి రిజిస్టర్, డెలివరీలకు సంబంధించిన రిజిస్టర్, మందుల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర మందుల నిల్వలు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. వైద్యుల హాజరుపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సాదించాలని సూచించారు. ఆస్పత్రికి లో కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని, ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీపనగండ్ల మండలం పరిధిలోని కల్వరాల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే లోడింగ్ చేయాలని చెప్పారు. రైతులను ఎక్కువ రోజులు వేచి ఉంచేలా చేయొద్దని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇలాంటి అసౌకర్యం గాని ఇబ్బందులు గాని లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రానికి ఎంతమంది రైతులు ధాన్యం చేస్తున్నారు ఎంత మేర తెస్తున్నారని వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని పిపిసి ఇన్చార్జికి సూచించారు. లోడింగ్ జరిగి ధాన్యం మిల్లుకు పంపిన వెంటనే వాట్సాప్ ద్వారా ట్రక్ షీట్ తెప్పించుకొని రైతులకు వెంటనే నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీపనగండ్ల ఎంపీడీవో శ్రీనివాస్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. (Story : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి)