ఎర్ర సైన్యం కవాతు తో ఎరుపెక్కిన రాజమండ్రి
కులం మతం వైశ్యమాలు లేని సోషలిస్టు నవభారతం కోసం సిపిఐ పోరాటం
ఆర్ఎస్ఎస్ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం
పురందేశ్వరి గారు ఫిరాయింపులు ప్రోత్సహిస్తారా ఇది మీకు తగునా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
పోరాటాలి ఊపిరిగా సిపిఐ పని చేస్తుంది
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ
రాజమండ్రిలో కదం తొక్కిన ఎర్రసైన్యం
న్యూస్ తెలుగు / చింతూరు : ఆర్ ఎస్ ఎస్ శక్తులు నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు నిచ్చారు శుక్రవారము సాయంత్రం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం లో సీపీఐ శత వసంతాల సందర్భంగా ఆవిర్భావ సభ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది.
అంతకముందు సీపీఐ కార్యాలయం నుంచి వందలాది మంది రెడ్ షర్ట్స్ వాలంటీర్ ల తో ఎర్ర సైన్యం కవాతు బయలుదేరి తాడితోట, బై పాస్ రోడ్, స్వామి ధియేటర్, దేవీచౌక్ గోకవరం బస్ స్టాండ్ మీదుగా వేదిక వద్దకు చేరుకుంది. దారిపొడవునా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు దారి పొడవునా సిపిఐ నాయకులు ప్రజలకు అభివాదం చేశారు
ముందుగా కె రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచిందని కార్మికులు కర్షకులు అణగారిన వర్గాల తరఫున నిర్విరామంగా పోరాటం చేసిందని ఆయన అన్నారు నాటి బ్రిటిష్ వలసవాద దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా నేటి మతవాద పరిపాలనకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు మతతత్వ శక్తులు నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆయన ఉద్ఘాటించారు స్వాతంత్ర కోసం జరిపిన పోరాటంలో సిపిఐ అగ్రభాగాన నిలిచిందన్నారు ఈ వందేళ్ల వారసత్వాన్ని కాపాడుకుంటామని దానిని ముందు తీసుకెళ్లడం మనందరి బాధ్యతని ఆయన అన్నారు భారతదేశంలో 100 సంవత్సరాలు కలిగి ఉన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని, కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31వ తారీకు వరకు సిపిఐ 100వ ఆవిర్భావ సభలో జరుగుతాయని, సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భావించిందని తెలిపారు. భారత స్వతంత్ర రావడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క పుత్రిక అని వ్యంగ్యం చేశారు. భారత స్వతంత్ర పోరాటంలో బిజెపి గానీ ఆర్ఎస్ఎస్ కి ఏ విధమైన సంబంధంలేదని, వారు గద్దెనెక్కిన తరువాత స్వతంత్ర సమరయోధులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యసభలో అవమానించినట్లు కేంద్ర మంత్రి అమిత్షా మాట్లాడినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఏ విధమైన చర్చలు తీసుకోకపోవడం హాస్యస్పాదికంగా ఉందని, భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ని కించపరిచే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రామకృష్ణ అన్నారు.వాజ్పాయ్ శతజయంతి వేడుకల్లో అవినీతి కుంభకోణం లో ముఖ్య పాత్రధారిగా ఉన్న విశాఖ డైరీ చైర్మన్ కి కండువా కప్పి అవినీతి మయుడ్ని నీతిమంతుడుగా మార్చిందని పురందేశ్వరి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలలో 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వేసిందని అన్నారు. అనకాపల్లి లో ఉన్న మీటల్ సంస్థ కు క్యాపిటల్ మైన్స్ అడగడంపై చంద్రబాబు విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరణం చేయడం చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు వచ్చిందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ద్వదమెత్తారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను హోం మంత్రి అమిత్ షా అవమానించారని ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు అధికారులకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ 15 వేల 486 కోట్లు భారం ప్రజలపై వేశారని ఆయన ధ్వజ మెత్తారు సెకి తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు ఆదాని వైపు ఉంటారా ? ప్రజల వైపు ఉంటారా ఆయనే తేల్చుకోవాలన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నోరెత్తని చంద్రబాబు మెటల్ కు గురించి మోడీతో మాట్లాడటం చాలా అన్యాయం అన్నారు పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సభ లో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు జట్లు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే జ్యోతి రాజు తోట లక్ష్మణ్ కే శ్రీనివాస్ సిహెచ్ సునీల్ పంతం నాగేశ్వరరావు ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంతి లక్ష్మణరావు మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ పి లావణ్య తదితరులు ప్రసంగించారు. (Story : ఎర్ర సైన్యం కవాతు తో ఎరుపెక్కిన రాజమండ్రి)