వినుకొండలో ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి
న్యూస్ తెలుగు/వినుకొండ : వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండ్ నందు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, 6 వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సింగంశెట్టి బాల గురవయ్య , కామిశెట్టి కిషోర్, కాపు పెద్దలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగ శ్రీను రాయల్ మాట్లాడుతూ. వంగవీటి మోహన రంగా ఒక ఎమ్మెల్యే గా ఉంటేనే ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. బడుగు బలహీన వర్గాలకే ఎంతో మందిని ఆదుకున్నారు. ఆ వ్యక్తిని కోల్పోయాం అందుకు చాలా బాధగా ఉంది. కానీ మనకు ఇప్పుడు కొత్త నాయకుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిలబడ్డారు. ఇలాంటి నాయకులు వెనకాల మనం నిలబడాలి. బడుగు బలహీన వర్గాలకు అండగా నడవాలని సంభాషించారు. గంధం కోటేశ్వరరావు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కి, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అకాల మరణం చెందిన తర్వాత ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా కి కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో రంగా పటం ఉంది అంటేనే ఆయన బడుగు బలహీన వర్గాలకు ఎంత సహాయం చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. బాల గురవయ్యమాట్లాడుతూ. మనందరం పవన్ కళ్యాణ్ మన కోసం నిలబడ్డారు. మనం కూడా పవన్ కళ్యాణ్ కోసం నిలబడాలి అని అన్నారు. (Story : వినుకొండలో ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి)