చింతూరులో ఘనంగా
వంగవీటి మోహన రంగా 36 వర్ధంతి
న్యూస్‌తెలుగు/చింతూరు :చింతూరు లో గురువారం సంత పాకల గ్రౌండ్ లో వంగవీటి మోహన రంగా36 వర్ధంతి ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్,సింగంశెట్టి దుర్గారావు,విష్టు,ఈ కార్యక్రమానికి హాజరై రంగా చిత్ర పాఠానికి పూల దండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు.రంగా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సుమారు వెయ్యి మందికి మహా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో గూడపు నాగరాజు, శేషునాయుడు, భాస్కర రావు, శ్రీను, కోట్ల బాబ్జి, కోట్ల ప్రకాష్, నక్కా శేఖర్, తేజ బిట్టు, షాహిద్, రాబర్ట్, గణేష్, దాసరి రవికుమార్, బత్తుల శేషగిరి నాయుడు, కుకునూరు. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. (Story : చింతూరులో ఘనంగా వంగవీటి మోహన రంగా 36 వర్ధంతి)