పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు స్ఫూర్తిదాయకం
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు గురువారం స్థానిక జీఎస్ఆర్ కార్యాలయం నందు నిర్వహించారు.ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు.
వంగవీటి రంగా మరణించి 36 ఏళ్ళు గడిచినా ఆయన పై ప్రజలకు అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు.
పేదల కోసం జీవించి , వారితో మమేకమై బతికిన రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారున్నారు.
ఎమ్మెల్యేగా కొన్నాళ్లే పని చేసినా …పేద ప్రజల సమస్యలపై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు రంగా అని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం లో జనసైనికులు ఎంటి రాజేష్ , ఎమ్. పవన్ కుమార్ , గొల్లపల్లి మహేష్ , సుంకరి వంశీ, పృథ్వీ భార్గవ్, పి.అభిలాష్ , డి.హిమంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు స్ఫూర్తిదాయకం)