ఘనంగా మహామండలపూజ పాల్గొన్న మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా మండల పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. పూజ కార్యక్రమంలో మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.
రావుల.చంద్రశేఖర్ రెడ్డి కి ఆలయ కమిటీ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఉత్సవమూర్తికి రావుల.చంద్రశేఖర్ రెడ్డి అభిషేకాలు నిర్వహించారు.స్వామి వారి చక్రస్నానం మరియు ఊరేగింపులో పాల్గొన్నారు. అన్నం అయ్యప్పతో స్వామివారికి నైవేద్యం సమర్పించి స్వాములకు స్వయంగా భిక్ష వడ్డించారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి గురుస్వాములకు,గానపరులకు,నాయిబ్రహ్మణులకు ఘనంగా సన్మానం చేసారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి రాజానగరం జాతరలో కలియతిరుగుతూ తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలకు తినుబండారాలు ఇప్పించి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ముత్తుకృష్ణ,నరేందర్, బీచుపల్లి యాదవ్, నందిమల్ల.అశోక్,కాగితాల.గిరి,వెంకటేష్,ప్రకాష్,బాలు నాయుడు, ఆలయ కమిటీ అధ్యక్షులు నగేష్, గట్టు.వెంక్కన్న,బి.ఆర్.ఎస్ నాయకులు పి.రమేష్ గౌడ్, నంది మల్ల.శారద,నాగన్న యాదవ్, ఉంగ్లమ్మ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,పెబ్బేరు.రాజశేఖర్, జాథ్రు నాయక్, యుగంధర్ రెడ్డి,యాదయ్య సాగర్,నాతమయ్య,ఎం.డి.గౌస్,వడ్డే. రమేష్,వహీద్,తోట.శ్రీను,ఆటో యూనియన్ నాయకులు యాదయ్య,తాత రాములు,అనిల్, జెంగిడి.వెంకటేష్,గుర్రం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా మహామండలపూజ పాల్గొన్న మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డి)