‘రెట్రో’- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్
టైటిల్ టీజర్ రెట్రో వరల్డ్ కి గ్లింప్స్ ని ప్రజెంట్ చేస్తోంది, ఇది ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ , ఎమోషనల్ డెప్త్‌ను బ్లెండ్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. టీజర్ సూర్య పాత్రపై కేంద్రీకృతమై ఉంది, పూజా హెగ్డే పాత్రపై అతని ప్రేమ, హింసాత్మక ప్రపంచం నుండి బయటికి వెళ్ళడానికి అతని సంఘర్షణని ప్రజెంట్ చేస్తోంది.
కాశీ ఘాట్‌లపై కూర్చున్న సూర్య, పూజల మధ్య పీస్ ఫుల్ మూమెంట్ లో టీజర్ ప్రారంభమైంది. ఒక పవర్ ఫుల్ సన్నివేశంలో, సూర్య తన హింసాత్మక గతాన్ని విడిచిపెడతానని హామీ ఇస్తాడు, రౌడీయిజం ప్రపంచంలో భాగం కానని ప్రతిజ్ఞ చేస్తాడు. పూజ హెగ్డే కి ప్రపోజ్ చేసినప్పుడు ఈ సున్నితమైన క్షణం రొమాంటిక్ మలుపు తీసుకుంటుంది, ఆమె ఆనందంగా అంగీకరిస్తుంది.
టీజర్ లో సూర్య పాత్ర తాలూక గత సంఘర్షణ కీలకంగా వుంది. సూర్యని అతని తండ్రి ప్రపంచంలోని ఇతర ప్రమాదకరమైన వ్యక్తులతో ముడిపడి ఉన్న వైలెంట్ లెగసీ వెంటాడుతుంది. టీజర్ అతని ఫెరోషియస్ గ్యాంగ్‌స్టర్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపుతుంది. టీజర్ ఫైనల్ మూమెంట్స్ లో సూర్య అసలైన ఇంటెన్స్ వెర్షన్ ని ప్రజెంట్ చేస్తోంది.
టీజర్ సూచించినట్లుగా, ఈ చిత్రం కమర్షియల్ అప్పీల్‌ను గ్రిప్పింగ్ కథనం వుంటుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ విజువల్ గ్రాండియర్‌తో మెరుస్తుంది, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ ని ఎలివేట్ చేసింది. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.
ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలు.
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్)
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: మహమ్మద్ షఫీక్ అలీ
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : రెట్రో’- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్)