ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది
బినామీ లతో ఏల్టిఅర్ కేసుల్లో ఇరికించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనుడు డోర్ డెలివరీ అనంత బాబు
ఎమ్మెల్యే మతి మిరియాల శిరీష దేవి స్వతహాగా పరిపాలనా చేస్తుంటే ఓర్చుకోలేక ఆరోపణలు చేస్తూ ఉంటాం హాస్యాస్పదం
గిరిజన,గిరిగినేతర ఐక్యతకు భంగం కల్పిస్తూ రెచ్చగొట్టడం సరైన విధానం కాదు
న్యూస్‌తెలుగు/చింతూరు : ఎల్టీఆర్ కేసులు పెట్టించింది ఎవరో? వాటిని బినామీ లతో తిరగతొడుతుంది ఎవరో? ప్రజలకు తెలుసు. ప్రజా ప్రభుత్వం పై ప్రజా నాయకులపై మీరు ఎంత విష ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు.మీ పరిపాలనా అంత డమ్మీ ఎమ్మెల్యే లతో పరిపాలించిన తీరు ప్రజలకు తెలుసునని ఏల్టీఆర్, కరంట్ చార్జీలు, అభివృది పై మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. గత ప్రభుత్వ పాలనలో మీ నాయకత్వం లో ఎల్టిఅర్ కేసులు పెట్టించి ప్రజలను బయపెట్టించి సెటిల్ మెంట్ చేసుకొని కోట్ల రూపాయలు అక్రమ కలెక్షన్ చేసింది మీరు కదా? ఇప్పుడు మళ్ళీ మీ బినామీ తో ఎల్టిఅర్ కేసులు మళ్ళీ తిరిగ తొడిస్తు… ఆ నెపం ఆదివాసి ఎమ్మెల్యే పై నెటడం ఎంతవరకు సబబు? మా చింతూరు మండలం లో మీ ప్రియ శిష్యుడు మీ పార్టీ నాయకుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు కలెక్షన్ చేసి మీకు ఇచ్చింది నిజం కాదా? పోలీసు స్టేషను లో దౌర్జన్యాలు చేసింది నిజం కదా? నియోజకవర్గంలో ఆదివాసి ఎమ్మెల్యే స్వతహాగా పరిపాలిస్తుంటే ఓర్చుకోలేక అడుగడుగునా అడ్డుకోవడం మీకు తగునా? మీ సర్టిఫికెట్ డమ్మీ,మీ ఎమ్మేల్యే డమ్మీ,మీ పరిపాలనా డమ్మీ, అది చూసి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రభుత్వం లో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన అందిస్తున్న రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి పై, మా నాయకుడు విజయభాస్కర్ లపై అవకాలు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఉండటానికి నీ చెంచాలు కాదు.మీ డోర్ డెలివరి పరిపాలనా,మీ డమ్మీల పరిపాలనా చూసి విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం కూటమి నీ గెలుపించుకొన్నారు. గిరిజన , గిరిగినేతర ఐక్యతకు భంగం కల్పిస్తూ రెచ్చగొట్టడం సరైన విధానం కాదని.. ప్రజలు బుద్ధి చెప్పిన ఇంక బుద్ధి రాలేదనీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపణలను ఖండించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అకోజు నూకాచరి,ఎస్టీ సెల్ అద్యక్షుడు తుర్రం ముత్తయ్య, కారం వాసు, తుర్రమ్ సూర్యనారాయణ, సీనియర్ నాయకుడు అనిగి చంద్రయ్య, సొడి రాఘవయ్య , సయ్యద్ ఆసీఫ్,కట్ట శంకర్, తెలుగు యువత అద్యక్షుడు గెడ్డం సురేష్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది)