Home వార్తలు తెలంగాణ అయ్యప్ప స్వామీ ఆభరణాల ఊరేగింపు

అయ్యప్ప స్వామీ ఆభరణాల ఊరేగింపు

0

అయ్యప్ప స్వామీ ఆభరణాల ఊరేగింపు

మహా మండల పూజకు రావుల చంద్రశేఖరరెడ్డి ఆర్థిక చేయూత

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రతి సంవత్సరం మహా మండల పూజ 26.12.2024 ఘనంగా ధర్మశాస్తా అయ్యప్ప స్వామీ దేవాలయంలో జరుగుతుంది.మహా మండల పూజకు మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి ప్రతి సంవత్సరంలాగే 1లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించారు. మండల పూజ కార్యక్రమములో స్వయంగా రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహిస్తారు. మహా మండల పూజలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారని గురుస్వామి నందిమల్ల.అశోక్ తెలిపారు. అయ్యప్ప స్వామి మహా మండల పూజ సందర్భంగా ఆలయ కమిటీ గురుస్వాముల ఆధ్వర్యములో స్వామీ వారి ఆభరణాల ఊరేగింపు రామాలయం నుండి రాజీవ్ చౌరస్తా ,ఇందిరా పార్క్ మీదుగా ఆలయానికి స్వాముల శరణ గోషలతో,భక్తుల నృత్యాల బాజాభజంత్రలతో స్వామి సన్నిధికి చేరుకున్నాయి. ఊరేగింపులో ఆలయ కమిటీ అధ్యక్షులు నగేష్,గట్టు.వెంకన్న, గురుస్వాములు ముత్తుకృష్ణ, ప్రకాష్,నరేందర్, చీర్ల.కృష్ణ సాగర్, బీచుపల్లి యాదవ్, నందిమల్ల.అశోక్,కె.వి.ఆర్, సొప్పరాల.రాము, వెంకటేష్,ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ తోపాటు ఉంగ్లమ్మ్. తిరుమల్ పాల్గొనగా ప్రేమ్ నాథ్ రెడ్డి విద్యార్థులతో పాల్గొని ఊరేగింపును విజయవంతం చేసారు. (Story : అయ్యప్ప స్వామీ ఆభరణాల ఊరేగింపు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version