వనపర్తికి చెందిన అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ పట్టా
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాద్‌లోని నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ఐందాల ప్రశాంతికి ఉస్మానియా యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) లభించింది.
“A Machine Learning Framework and Algorithms for Anomaly Detection Towards Network Security” అనే అంశంపై ఆమె హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో తన పరిశోధన చేసింది.
వనపర్తికి చెందిన జర్నలిస్టు ఏ ఓంకార్ కూతురు అయిందాల ప్రశాంతి కొత్తకోట పబ్లిక్ స్కూల్ నందు ప్రాథమిక విద్యను అభ్యసించింది. వనపర్తి లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, కొట్టం తులసి రెడ్డి కళాశాలలో బీటెక్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన ప్రశాంతిని ఆమె చదివిన విద్యాసంస్థల యజమానులు రాజ వర్ధన్ రెడ్డి, గులాం హుస్సేన్, పి జగదీశ్వర్ లు అభినందించారు. (Story : వనపర్తికి చెందిన అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ పట్టా)