రోడ్డు ప్రమాదంలో ఇరువురు మున్సిపల్
కార్మికులు మృతి
న్యూస్ తెలుగు/ వినుకొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం రాత్రి వినుకొండ పట్టణ సమీపంలోని పసువులేరు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెండారు. ఒకరు ప్రతాపుల చిన్న గురవయ్య, సోదరుడు భీమరాజు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రతాపుల గురవయ్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన భీమరాజును విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు బాధితులు తెలిపారు. అయితే సోమవారం బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ స్తానిక శివయ్య స్తూపం సెంటర్ లో ఆందోలన చేపట్టారు. ఈ నేపధ్యంలో బాధితులకు సంబంధించిన ఓ వ్యక్తీ న్యాయం చేయాలంటూ ఒంటి పై పెట్రోలు పోసుకోవటం తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వారికి నచ్చ చెప్పారు. దీంతో పరిస్తితి అదుపులోకి వచ్చింది. శివయ్య స్తూపం సెంటర్ లో భారిగా ట్రాఫిక్ నిలిచి పోవటంతో పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. (Story : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మున్సిపల్ కార్మికులు మృతి)