ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రైతు దినోత్సవం
న్యూస్‌తెలుగు/ చింతూరు: తెలుగు న్యూస్ చింతూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రైతు దినోత్సవం కార్యక్రమం ఆర్థశాస్త్ర విభాగాధిపతి.జి.వెంకటరావు అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ విచ్చేసి విధ్యార్ధినీ, విధ్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశానికి 5 వ ప్రధాన మంత్రి గా పని చేసిన చౌదరిచరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భార తప్రభుత్వం జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించిందనీ తెలిపారు. రైతులు నిత్యం శ్రమిస్తున్నారని ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అత్యున్నత స్థానంలో ఉందని తెలిపారు.ఆర్థ శాస్త్ర విభాగాధిపతి జి.వెంకటరావు మాట్లాడుతూ దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని ప్రజలందరు రైతు కష్టాన్ని గౌరవించాలనీ, దేశ భద్రత కు సరిహద్దులో సైనికుడు ఎంత అవసరమో,దేశ ప్రజల జీవనానికి రైతు పండించే పంటలు అంతే అవసరమని తెలిపారు విధ్యార్థినీ, విధ్యార్థులను’జై కిసాన్, జై జవాన్’అనే నినాదంతో చైతన్య పరిచారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు ఆర్.సిహెచ్ .నాగేశ్వరావు, యస్.అప్పనమ్మ, బి.శ్రీనివాసరావు, కె.శైలజ,డాక్టర్.వై.పద్మ, జి.హరతి, కె.శ్రీదేవి, కె.శకుంతల, కె.శ్రీలక్ష్మి. జి.సాయికమార్, యన్.రమేష్ h తదితర అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది,విధ్యార్థిని,విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రైతు దినోత్సవం)