Homeవార్తలుఫిబ్రవరి 20న "ఎర్రచీర - ది బిగినింగ్" 

ఫిబ్రవరి 20న “ఎర్రచీర – ది బిగినింగ్” 

ఫిబ్రవరి 20న “ఎర్రచీర – ది బిగినింగ్” 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే తాజాగా ఈ సినిమా బిజినెస్ షో వేశారు మేకర్స్. బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అంతేకాక థియేటర్ రిలీజ్ ఇప్పుడు హడావుడిగా కాకుండా శివరాత్రి సీజన్ లో చేస్తే బాగుంటుందని సూచనలు చేశారు. సినిమా కంటెంట్ కూడా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో మేకర్స్ కూడా వారు చెప్పింది నిజమేనని భావించి సినిమా రిలీజ్ వాయిదా వేశారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నటీనటులు – బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు,  శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే-  దర్శకత్వం – సుమన్ బాబు. (Story : ఫిబ్రవరి 20న “ఎర్రచీర – ది బిగినింగ్” )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!