Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పరుగుల వీరుడు అబ్దుల్లాకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం

పరుగుల వీరుడు అబ్దుల్లాకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం

పరుగుల వీరుడు అబ్దుల్లాకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం

న్యూస్ తెలుగు / వినుకొండ :దాతృత్వానికి, దాన గుణానికి హద్దులు ఎల్లలు లేవని చాటిన గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు మహమ్మద్. నసీర్ అహ్మద్ తన నియోజకవర్గం, తన జిల్లా, కానీ ఒక పేద మైనారిటీ గ్రామీణ క్రీడాకారుడు, పరుగుల వీరుడు, పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణవాసి అయిన షేక్ అబ్దుల్లాకు 2025 ఫిబ్రవరి 25న లడ్డాక్ (లే) లో జరగబోయే 42 కిలోమీటర్ల మార్ధాన్ గిన్నిస్ బుక్ పోటీలలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం తో పాటు గెలుపు కొరకు మనోధైర్యం ఇచ్చిన గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు. ఇచ్చిన మనోధైర్యానికి, చేసిన సహాయానికి సంతోషిస్తూ సదరు అబ్దుల్లా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరియు ఎమ్మెల్యే దాతృత్వం చూసి స్పందించిన వ్యక్తిగత పనుల కోసం వచ్చిన ప్రముఖులు ఇద్దరు స్పందించి, స్వచ్ఛందంగా వారు కూడా ఆర్థిక సహాయానికి ముందుకు రావడం ఎంతో సంతోష‌దాయకం. ఈ కార్యక్రమానికి సహకరించిన వినుకొండ డిగ్రీ కాలేజీ విశ్రాంత ఉద్యోగి ఎండి కరీముల్లా, గుంటూరు వాసి, సంఘ సేవకులు ,మైనార్టీ నాయకులు షేక అప్సర్ , గుంటూరు తూర్పు నియోజకవర్గం యువ మైనార్టీ నాయకులు షేక్ జుబేర్ లకు క్రుతఘ్నతలు తెలిపారు. (Story : పరుగుల వీరుడు అబ్దుల్లాకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!