UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి

న్యూస్ తెలుగు/చింతూరు :  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రామానుజన్ జయంతి కార్యక్రమం గణిత శాస్త్ర విభాగాధిపతి.కె.శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ విచ్చేసి విధ్యార్ధినీ, విధ్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రామానుజన్ పిన్న వయస్సులోనే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ లో సభ్యుడిగా సేవలు అందించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని,రామానుజన్ 33 సంవత్సరాల జీవితంలో గణిత శాస్త్రంలో అనేక ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించరాన్నారు. గణిత శాస్త్ర విభాగాధిపతి కె.శ్రీలక్ష్మి మాట్లాడుతూ రామానుజన్ కనుగొన్న వాటిలో ముఖ్యంగా మాక్ తీటా ఫంక్షన్స్,అనలిటికల్ జామెంట్రీ,పార్టీ సియాన్ ఆఫ్ నంబర్స్,త్రికోణమితి ఆయిలర్ ఫార్ములా,మ్యాజిక్ స్క్వేర్,ఆధారంగా వచ్చిన ‘స్ట్రింగ్ థియరీ’అనేది కేన్సర్ వ్యాధి పరిశోధనలో ఉపయోగపడుతుందన్నారు.రామానుజన్ సేవలు చిరస్మరణీయమనీ తెలిపారు.రామానుజన్ అతిచిన్న వయస్సులో లండన్ యూనివర్సిటీ లో పి.హెచ్.డి.అవార్డు పోందిన మహనీయుడనీ ఆయన కీర్తీ ప్రశంసనీయమైనదనీ తెలిపారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు,జి.వెంకటరావు,ఆర్.సిహెచ్. నాగేశ్వరావు,యస్.అప్ననమ్మ,బి.శ్రీనివాసరావు, కె.శైలజ,డాక్టర్.వై.పద్మ,జి.హరతి,కె.శ్రీదేవి,కె.శకుంతల,జి.సాయికుమార్,యన్.రమేష్ తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విధ్యార్థిని,విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1