భావితరాల భవిష్యత్తు కోసం
విద్యను అగ్రభాగంలో నిలిపాను
డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాణీ లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ ఉత్సవాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ కాలేజీలో చేరిన చదవకపోయినా ఈ కళాశాలలో అత్యంత అనుబంధం ఉందని అన్నారు. నేను చదువుకొనే రోజులలో మా మామయ్య మాజీ ఎం.ఎల్.ఏ డాక్టర్.బాలకిష్టయ్యా గారు ఈ కళాశాల ప్రభుత్వపరంగా చేయడానికి విశేష కృషి చేశారని అన్నారు. వనపర్తి నియోజక వర్గాన్ని విద్యలో అగ్రభాగాన నిలపడానికి చిన్నారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి నేను పోటీపడి పనిచేశామని అన్నారు. డాక్టర్.బా లకిష్టయ్య మౌలిక వసతులు కల్పించడంలో కృషి చేస్తే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు తాము ముందుకు తీసుకెళ్లామని అన్నారు. నా హయాములో మంజూరు అయిన బి.సి మహిళా కళాశాల మరియు జె.ఎన్.టి.యు కళాశాల నిర్మాణాల కోసం మౌలిక వసతుల కల్పన కోసం చిన్నారెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాణీలక్ష్మీదేవమ్మ కళాశాల ఎందరినో ఉన్నత స్థాయిలో నిలిపిందని దానికి కొనసాగింపుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కృషి చేద్దామనీ కోరారు.
ఆహ్వాన కమిటీ గౌరవ నిరంజన్ రెడ్డి గారినీ ఘనంగా సన్మానించింది. నిరంజన్ రెడ్డి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు. (Story : భావితరాల భవిష్యత్తు కోసం విద్యను అగ్రభాగంలో నిలిపాను)