బ్రాహ్మణపల్లి మైనర్ కాలవను పరిశీలించిన అధికారులు, ప్రజా సంఘాలు, రైతులు
న్యూస్ తెలుగు/వినుకొండ : కొండ్రముట్ల నుండి మైనర కాలవ బ్రాహ్మణపల్లి, విఠంరాజు పల్లి చివరి వరకు కాలువ పూడిపోయి, అడవిని తలపించే లాగా చెట్లు మొలిసి, రైతులు కాలువ మీద నడవాలంటేనే అవకాశం లేకుండా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రజాసంఘాలు, జిల్లా కలెక్టర్, ఎస్సీ కి అర్జీలు 0ఇచ్చిన నేపథ్యంలో స్థానిక అధికారులు శనివారం ఉదయం కాలువలను అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. కాలువలు పూడిపోవటం వల్ల నీళ్లు పొలాల మీద ఇళ్ల ల్లోకి చేరుతున్నాయని తమ బాధ వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని కాలవ బాగు చేసి రవాణా మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు హేమంత్ కుమార్, నాగార్జునసాగర్ ఓ అండ్ ఎం షిఫ్ట్ డివిజన్ వినుకొండ ఇంజనీర్ , ప్రజా సంఘాల నుండి వై వెంకటేశ్వరరావు, పిడిఎం రాష్ట్ర నాయకులు, బీసీ నాయకులు బాదుగునల శ్రీనివాసరావు, రైతులు కంట రంగారావు, ఏరువా రాజశేఖర్ రెడ్డి, కాసు శ్రీనివాస్ రెడ్డి, వై శంకర్రావు తదితర రైతులు పాల్గొన్నారు.(Story : బ్రాహ్మణపల్లి మైనర్ కాలవను పరిశీలించిన అధికారులు, ప్రజా సంఘాలు, రైతులు )