UA-35385725-1 UA-35385725-1

నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది

నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది

పిడికి రాజన్న దొర

న్యూస్ తెలుగు /సాలూరు : స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఎక్కువకాలం తెలుగుదేశం పార్టీ వారే పాలించారని అప్పుడు ఎందుకు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మక్కువ మండలం లో ఉన్న బాగుజాలకు సీసీ రోడ్లు నిర్మించానని బాగుజాల నుండి చిలక మెండింగు వరకు మట్టి రోడ్ వేయించాను కాబట్టే మీరు బాగుజాల నుండి చిలక మేండoగి వరకు నడిచి వెళ్లారని ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు శనివారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపై గిరిజన ప్రాంతంలో పర్యటించడంస్వాగతిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో అధికారులను పిలిచి అంచనాల తయారు చేయించిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆ వర్కులు మంజూరయ్యాయని అన్నారు. సిరివర నుండి కొదమ రోడ్డు కూడా నే నే నిధులు మంజూరు చేయించానని ఆ పనులు ప్రారంభమయ్యాయని ఆ రోడ్డు కూడా పనులజరుగుతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా అభిమానం అని ఆయన కొన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక మహిళ డెలివరీ మార్గ మద్యంలో అయ్యి ఆమె పాప చనిపోవడంతో పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటీసులు జారీ చేయడంతో 8 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు వేస్తామని జీవో జారీ చేసిన నిధులు మంజూరు చేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో కొండమీద ఒక్క గిరిజన గ్రామానికైనా రోడ్లు వేశారా దాని గురించి మీ క్యాబినెట్ లో చర్చించి చంద్రబాబును ప్రశ్నించాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పర్యటించలేదని అనడం ఎంతవరకు సమంజసమని నేను ఆ గ్రామాల్లో పర్యటించినో లేదో అక్కడున్న గిరిజనులను నా పేరు చెప్పి అడిగితే బాగుండేదని అక్కడ నేను పర్యటించనో లేదో తెలుస్తుందని అన్నారు. ప్రస్తుత మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు గాని ప్రస్తుతం గాని ఆ గ్రామాల్లో వచ్చారా అని ఆమెను అడిగితే బాగుండేదని అన్నారు. మీ ప్రాంతాలకి మంత్రులు ప్రజా ప్రతినిధులు వచ్చారా రాలేదా అని అనంగానే రాలేదని చెయ్యిలుపడం పద్ధతిగా ఉందా అని మంత్రి సంధ్యారాణి అడుగుతున్నానని అన్నారు. మీరు ప్రశ్నించడానికి వచ్చానని ఎన్నికల్లో చెప్పారు కదా గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయవలసిన బాధ్యత మీరు తీసుకోవాలని అన్నారు..పవన్ కళ్యాణ్ ను అందరూ కాబోయే సీఎం సీఎం అని నినాదాలు చేస్తే కాబోయే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అనడం నేనే ముఖ్యమంత్రి అవుతానని ఒక్కసారి అనకపోవడం ఒకసారి జన సైనికులు ఆలోచించుకోవాలని అన్నారు. మీరు అవగాహనతో మాట్లాడి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు.(Story : నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1