ఆ ఇద్దరి సేవలు మరచిపోలేం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో మానవ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ట్రెజరర్ జంపకానాల షేక్ షరీఫ్ మరో సభ్యులు స్టార్ వలీ సంస్మరణ సభ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఈ సభకి చామర్తి భవాని శంకర్ అధ్యక్షత వహించారు. షరీఫ్, వలీ కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పి.వి.సురేష్ బాబు మాట్లాడుతూ. షరీఫ్, వలీ మా మానవ సేవ సమితికి చేసిన సేవలు మర్చిపోలేము అని వారి మరణం మమ్మల్ని ఎంతో దుఃఖానికి దారితీసింది అన్నారు. ప్రముఖ న్యాయవాదులు పీ.జే. లుకా, సి. హెచ్.ఎల్.ఎన్. మూర్తి మాట్లాడుతూ. మానవ సేవ సమితి వారు వినుకొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నందుకు సంస్థ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. కూచి రామాంజనేయులు జస్టిస్ పాల్గొని షరీఫ్, వలి వ్యక్తిత్వాన్ని, మంచి మనిషిలు అని మానవా సేవా సమితి తో వారికున్న అనుభూతులను గుర్తు చేశారు. 15 సంవత్సరాల నుండి మానవ సేవా సమితి సేవా కార్యక్రమాలు వినుకొండ ప్రజలు మర్చిపోరని, పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. (Story ;ఆ ఇద్దరి సేవలు మరచిపోలేం)