వరికుప్పల పై టార్పాలిన్ లు కప్పాలి
న్యూస్ తెలుగు /సాలూరు : తుఫాన్ కారణంగా పొలంలో నీరు లేకుండా చుసుకుని వరికుప్పల పై టార్పాలిన్ లు కప్పాలని సాలూరు ఏడిఏ M మధుసూదన్ రావు ఏవోP అనురాధ తెలిపారు. శుక్రవారం సాలూరు మండలంలో కొత్తవలస కరాసవలస గ్రామాలను సందర్శించి రైతులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పొలం లో నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు నీరు బయటకి పోయేలా చూసుకోవాలని తెలిపారు. మండలంలో 80 టార్పలిన్లు అందుబాటులో ఉన్నాయని, అవసరం అయిన రైతులు సంబధిత రైతు సేవా కేంద్రాలును సంప్రదించి టార్పాలిన్లు తీసుకొని , మరలా తుఫాన్ అనంతరం RSK కేంద్రాల్లో అందజేయాలని తెలిపారు.తుఫాన్ కారణంగా మండలంలో ఎక్కడైనా ఏ పంటలకు అయిన నష్టం జరిగినట్లు అయితే సంబధిత RSK లో ఉన్న సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. వరి చేను కుప్పలుగా ఉన్నచోట కూడా టార్పలిన్లు సహాయంతో కప్పుకోవాలని తెలిపారు. ధాన్యం కుప్పలు కూడా తడవకుండా టార్పలిన్లు సహాయంతో కప్పుకోవాలని సూచించారు. (Story : వరికుప్పల పై టార్పాలిన్ లు కప్పాలి)