UA-35385725-1 UA-35385725-1

వెలుగు యానిమేటర్ల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరహార దీక్షలు కొనసాగింపు

వెలుగు యానిమేటర్ల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరహార దీక్షలు కొనసాగింపు

సీఐటీయూ డిమాండ్

న్యూస్ తెలుగు/చింతూరు  : సీఐటీయూ ఆధ్వర్యలో రంపచోడవరం ఐటీడీఏ ముందు వెలుగు యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు మొదటి రోజు చేపట్టారు. ఈ సందర్భంగా వెలుగు యానిమేటర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి అరగాటి,రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వెలుగు యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేకమార్లు సంభదిత అధికారులకు,ఐటీడీఏ ముందు ఆందోళనలు చేసి విన్నమించుకున్న సమస్యలు పరిష్కారం చెయ్యడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ రిలే నిరహార దీక్షలు కొనసాగుతాయని అన్నారు.బకాయి పడ్డవేతనాలు చెల్లించాలని,ఉద్యోగ భద్రత కలిపించాలని,ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని. టి.ఏ.డి.ఏ.లు కల్పించాలని,రాజకీయ,అధికారుల వేదింపులు ఆపాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయులు నరసింహ, బసీరా, కే.సత్యవతి,పాల్గొన్నారు.(Story : వెలుగు యానిమేటర్ల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరహార దీక్షలు కొనసాగింపు )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1