విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం)వినుకొండ సబ్ డివిజన్ కమిటి సమావేశం శుక్రవారం నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు యస్ కే జానీ భాష అధ్యక్షతన వినుకొండ శివయ్య భవన్ లో జరిగింది. సబ్ డివిజన్ పరిధిలో కార్మికుల సమస్య లను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశం కు ముఖ్య అతిధిలుగా యూనియన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాసరావు మరియు ఏఐటీయూసీ పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు బుదాల శ్రీనివాసరావు, వ్యవసాయ రైతు సంగం నాయకులు ఉలవలపూడి రాము పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ. ప్రమాద భరితం గా ఉన్న విద్యుత్ సంస్థ లో పని చేస్తున్న కార్మికులను సంస్థ లో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని,దళారీ వ్యస్థ ను రద్దు చేయాలని, కార్మికులకురావలసిన 2022 సంవత్సరం పి.ఆర్. సి అరియర్స్ ను ఇవ్వాలని కోరారు. బుదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్స్ బిగించే ఆలోచనను ప్రభుత్వం విరమించాలని, స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రయత్నం చేస్తే ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయం లో ముఖ్య మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్మికులు చేయు పోరాటాలకు అన్ని విధాలుగా ఏఐటీయూసీ అండగా ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుంది అన్నారు. ఉలవలపూడి రాము మాట్లాడుడుతూ. రైతుల వ్యవసాయ బోర్ కనెక్షన్స్ లకు విద్యుత్ మీటర్స్ బిగించిరాదని, నాణ్యమైన విద్యుత్ ను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ సబ్ డివిజన్ కార్మికులు కొఠారి కృష్ణ, భగవాన్, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story :విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి)