స్వర్ణోత్సవాలకు తరలి రండి!!
పూర్వపు విద్యార్థి మల్యాల బాలస్వామి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి ప్రభుత్వ రాణీ లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 22న నిర్వహించే స్వర్ణోత్సవాలకు 1974 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి విధిగా హాజరుకావాలని ఆనాటి పూర్వపు విద్యార్థి జర్నలిస్టు మల్యాల బాలస్వామి పిలుపునిచ్చారు, వనపర్తి పట్టణ సమీపంలోని నర్సింగ్ గాయపల్లి గ్రామంలో గల డిగ్రీ కళాశాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయని కళాశాల ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఎన్నో ఏళ్ల తర్వాత మిత్రులను కలుసుకోబోతున్న ఈ తరణం కోసం వేయికళ్లతో ఎదురు చూద్దామని ప్రతి ఒక్కరికి సమాచారం అందించి స్వర్ణోత్సవాలలో చేయి చేయి కలిపి తోడ్పాటు అందించి స్వర్ణోత్సవాలను విజయవంతం చేద్దామని అన్నారు.(Story : స్వర్ణోత్సవాలకు తరలి రండి!! )