22న పట్టభద్రుల ఆత్మీయ సమావేశం..
న్యూస్ తెలుగు /వినుకొండ : గుంటూరు నగరంలోని ఏటుకూరి రోడ్డు వివాహ కన్వర్షన్ సెంటర్ నందు ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి గుంటూరు- కృష్ణా జిల్లాల పట్టబద్రులకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, తప్పనిసరిగా పట్టభద్రులందరూ సమావేశానికి హాజరుకావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు కోరారు. సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ జివీ. ఆంజనేయులు,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు భూపతి రావు తెలిపారు. (Story :22న పట్టభద్రుల ఆత్మీయ సమావేశం..)