Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆ సచివాలయంలో ప్రింటర్స్ పనిచేయవు

ఆ సచివాలయంలో ప్రింటర్స్ పనిచేయవు

0

ఆ సచివాలయంలో ప్రింటర్స్ పనిచేయవు

బయటికి వెళ్లి తెచ్చుకోండి – మా దగ్గరకు ధ్రువీకరణ పత్రాలు రావు

న్యూస్‌తెలుగు/ప్రకాశం జిల్లా / అర్ధవీడు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డెప్యూటీ సి. ఎం.పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఓ వైపు రెవెన్యూ సదస్సులు,పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మండలము లో మాత్రం అధికారులు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. సచివాలయం లో ఏ సర్టిఫికెట్ కావాలన్నా,ఇక్కడ దొరకవ్,.. బయట వెళ్లి తెచ్చుకొండి అంటూ పంపిస్తున్నారు ఆ అధికారులు. ఇది ప్రకాశం జిల్లా లోనీ అర్థవీడు మండలం లో స్థితి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లోనీ సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు రాక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు, పధకాలకు నమోదు చేసుకోవాలని సచివాలయం వైపు పరుగులు పెడుతుంటూ మరోవైపు సచివాలయం లో మాత్రం ఇక్కడ ప్రింటర్స్ పని చేయవు, ఏ ధ్రువీకరణ పత్రం లభ్యం కాదు అంటూ బయట xerox సెంటర్స్ కు పంపుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారు ఆ అధికారులు. ఇకనైనా అధికారులు తగిన చర్యలు సచివాలయం లో మెరుగైన సేవలు అందించాలాని ప్రజలు కోరుతున్నారు.(Story : ఆ సచివాలయంలో ప్రింటర్స్ పనిచేయవు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version