సాంఘిక సంక్షేమ హాస్టల్ కు జెకె సిటీ ట్రస్ట్ 30 వేల సబ్మెర్సిబుల్ మోటర్ ఏర్పాటు
న్యూస్ తెలుగు/చింతూరు : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో నీటి సమస్య తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హాస్టల్ వార్డన్ తాతాజీ ఈ విషయాన్ని జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్ కు సమస్యను వివరించారు. హాస్టల్ ఆవరణలో 50వేలరూపాయల వ్యయంతో బోరు వేయించడం జరిగింది. అనంతరం బోరుకు కావలసిన మోటారు ప్యానల్సు పైపులు మొత్తం 30 వేల రూపాయల విలువ గల సామాగ్రిని గురువారం వార్డెన్ తాతాజీకి అందజేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ తాతాజీ మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్లో నీటి సమస్యతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా విషయాన్ని ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్లిన కొద్ది రోజుల్లోనే బోరు రిగ్గు పాయింటును తీసుకువచ్చి వేయించడం జరిగిందని ఆపై మోటారు గురించి కూడా అడిగిన వెంటనే కూడా అందజేశారని వారికి మా హాస్టల్ తరపున విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని వీరి లాగానే దాతలు మరి కొంతమంది ముందుకు వస్తే సమస్యలు పరిష్కరించబడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తాతాజీ. జెకె సిటీ ట్రస్ట్ సిబ్బంది నటరాజ్,ఏస్.కే. రియాజ్.విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : సాంఘిక సంక్షేమ హాస్టల్ కు జెకె సిటీ ట్రస్ట్ 30 వేల సబ్మెర్సిబుల్ మోటర్ ఏర్పాటు)