Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పెన్షన్ అనర్హత నోటీసులు ఇవ్వడం దారుణం

పెన్షన్ అనర్హత నోటీసులు ఇవ్వడం దారుణం

0

పెన్షన్ అనర్హత నోటీసులు ఇవ్వడం దారుణం

మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు/సాలూరు : పెన్షన్ దారుల పొట్ట కొట్టడానికే కుటమి ప్రభుత్వం పెన్షన్ దారులకు నోటీసులు జారీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆయన స్వగృహములో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు 66,34,742 పెన్షన్లు ఇస్తూ 92,547.66 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో సచివాలయాలు సిబ్బంది వాలంటీర్లు ద్వారా 1వ తేదీకే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తూ వికలాంగులకు డాక్టర్లు ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్ ద్వారా అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అనర్హత నోటీసులు ఇవ్వడం చాలా దారుణం అని దీని ద్వారా 1,57,000 మందికి పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టే ప్రజలందరూ ఆలోచించుకుని మీయ గ్రామాల్లో సర్వేలకు వచ్చిన అధికారులకు వివరాలు సక్రమంగా ఇచ్చి పెన్షన్ రద్దు కాకుండా చూసుకోవాలని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులం గాని. మతం గాని రాజకీయంగాని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. గతంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 65 సంవత్సరాలు వయసు పరిమితి ఉండేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 సంవత్సరాలకే వయసు పరమతి కుద్దించడం జరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో గత సంవత్సరం గా అర్హులైన పెన్షన్ దారులో సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న ఇప్పుడు వరకు ఆన్లైన్ ఓపెన్ చేయలేదని అన్నారు. దీనివలన వికలాంగుల. భర్త చనిపోయిన భార్యలు. పేదవారు పెన్షన్లు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం కుడి చేతితో పెన్షన్ ఇస్తే. ఈ కూటమి ప్రభుత్వం ఎడమ చేతితో లాగేసుకోవడానికి చూస్తుందని అన్నారు.కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకొని ఏది మంచి ప్రభుత్వమో ప్రజలు గ్రహించుకోవాలని అన్నారు.సూపర్ సిక్స్ లో భాగంగా 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ. ఎస్టీ. బీసీ కులాల వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని మాయమాటలతో రోజు రోజుకి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు మాజీ జేఏసీ కన్వీనర్ గిరి రఘు పాచిపెంట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాలయుడు వైసిపి నాయకులు గోవింద. రామకృష్ణ వెంకటరమణ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు (Story : పెన్షన్ అనర్హత నోటీసులు ఇవ్వడం దారుణం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version