సీతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ పై అవగహన సదస్సు
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మేజర్ ఎస్.పి ఎస్. ఒబెరాయ్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సివిల్ సర్వీస్ పరీక్ష అత్యున్నత మైనదని. ఈ పరీక్ష ద్వారా జిల్లా పరిపాలనాధికారిగా, రాష్ట్రానికి ప్రధాన అధికారికగా కూడా అవ్వొచ్చు అన్నారు.అందుకే ప్రజాసేవ చేయాలనుకునే వారందరూ ఐ.ఎ.ఎస్ అవ్వాలని భావిస్తుంటారన్నారు. యూపీఎస్సీ పరీక్ష రాస్తే ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు అయిపోవచ్చు అని చాలామంది భావిస్తుంటారని.
కానీ, యూపీ ఎస్సీ పరీక్ష ఒక్క ఐ.ఎ.ఎస్ కోసమే కాదు,చాలా విభాగాలకు సంబంధించి అధికారుల నియామకానికి సంబంధించినది కూడా అని ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్,ఐ.ఆర్.ఎస్. వంటి పోస్టులకు కూడా యూపీఎస్సీనే నిర్వహిస్తుందన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్,ఐ.ఆర్.ఎస్ పోస్టులను కేటాయిస్తారని తెలియజేసారు. ఏ. పి. పి. ఎస్. సి కి సంబంధించి గ్రూప్ -1, గ్రూప్ -2, విభాగలకు సంబందించిన విషయాలను తెలియజేశారు.
కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ – సివిల్ సర్వీసెస్ ఎంతో అత్యున్నత స్థానాలని అందిస్తున్నదని ఇందులో చేరిన వారికీ అత్యంత గౌరవ స్థానాలు దక్కుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినమేజర్ ఎస్.పి ఎస్. ఒబెరాయ్ కి ధన్యవాదములు తెలియజేసారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వి. రామమూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థులు సక్రమమైన బాట వేసుకోగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్లేసెమెంట్ ఆఫీసర్స్, విభాగధిపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. (Story : సీతంలో యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్, సివిల్ సర్వీసెస్ పై అవగహన సదస్సు)