రేపు పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు
న్యూస్ తెలుగు /సాలూరు : రేపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో గల బాగుజాల. సిరివర రోడ్లుకు ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి తో కలిపి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఐ టి డి ఏ ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. మన్యం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. (Story :రేపు పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు)