పట్టపగలే.. ఇంటిలోకి దూరి..!
తిరుపతి/న్యూస్‌తెలుగుః పట్టపగలే మహిళపై దాడిచేసి మెడలో గొలుసు చోరీ చేసిన ఘటన తిరుపతిలో జరిగింది. కొందరు దుండగులు ఇంటిలోకి దూరి కళ్ళలో కారం చల్లి దోపిడీ చేశారు. అవిలాల పరిధిలోని వాణి నగర్ లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న నాగ స్వాతి మెడలో గొలుసును దొంగలు అపహరించారు. సీసీ ఫుటేజ్ బట్టి చూస్తే ఇద్దరు దొంగలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి వచ్చినట్లు బాధితురాలు కూడా వెల్లడించారు. తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ ఎస్సై రామకృష్ణ తెలిపారు. (Story : పట్టపగలే.. ఇంటిలోకి దూరి..!)