UA-35385725-1 UA-35385725-1

ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ విధానంతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి

ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ విధానంతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి

న్యూస్‌తెలుగు/అమరావతి,18 డిసెంబరు:రాష్ట్రంలో ఇన్వెస్టుమెంట్ ట్రాకర్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్ మెకానిజమ్ పై అనగా ఎస్ఐపిసి,ఎస్ఐపిబి సమావేశాల తర్వాత ఆయా పెట్టుబడుల ప్రతిపాదనల పర్యవేక్షణ అంశాలపై సకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ సమీక్షించారు.క్షేత్ర స్థాయిలో కొన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారి లేనందున జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నోడలు అధికారిగా సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.వివిధ యూనిట్లు ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహం మరియు ఎగుమతుల కమిటీ (DIEPC) ముందు ఉంచి సకాలంలో ఆయా పరిశ్రమలు,యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.
పరిశ్రమ ఏర్పాటులో డిపిఆర్ స్థాయి నుండి యూనిట్ గ్రౌండింగ్ అయ్యే వరకూ నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఎస్ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్ మెకానిజమ్ కింద ఇకపై ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ఇన్వెస్టుమెంట్ ట్రాకర్ అనేది ఒక సమర్థవంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని దీనిద్వారా రాష్ట్రంలో వివిధ విభాగాల ద్వారా ఏర్పాటవుతున్న ప్రాజెక్ట్‌లను ట్రాక్ చేయడం ఎక్కడైనా వాటి ఏర్పాటులో అడ్డంకులుంటే వాటిని సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు ఈవిధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రాజెక్ట్ స్థితిని నిరంతరం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించేందుకే గాక జిల్లా పరిశ్రమ కేంద్రాలు ప్రాజెక్ట్ సమాచారం మరియు నవీకరింప చేసేందుకు ఈట్రాకర్ విధానంలో అన్ని విధాలా ఉపయోగపడుతుందని సిఎస్ పేర్కొన్నారు.అంతేగాక ఇన్వెస్టర్లు ప్రాజెక్ట్‌ల పురోగతి చెక్ చేయడానికి ఇన్వెస్టర్లు లాగిన్ అయి పరిశీలించు కోవచ్చని తెలిపారు.ప్రాజెక్ట్ ఏర్పాటులో బాటిల్ నెక్స్ గుర్తించి సకాంలో పరిష్కరించేందుకు,ప్రభుత్వాలకు డేటా ఆధారిత సమాచారాలను అందించి ప్రక్రియలను వేగవంతం చేయడంలో ఈవిధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.ప్రతిపాదిత ప్రజెక్టును ఇన్వెస్టుమెంట్ ట్రాకర్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎస్ఐపిసి, ఎస్ఐపిబిల ఆమోదం పొందాకు సకాలంలో ఆయా యూనిట్లు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశ్రమలు,ఇతర శాఖల అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఐఅండ్ఐ,ఐటి అండ్ సి,పుడ్ ప్రాసెసింగ్,నెడ్ క్యాప్ తదితర 14 విభాగాలకు చెందిన లైన్ డిపార్టుమెంట్లు ఈఇన్వెస్టుమెంట్ ట్రాకర్ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఎస్ఐపిబి ఆమోదం పొందాక సకాలంలో ఆయా యూనిట్లు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.అంతేగాక వారానికి ఒకసారి దీనిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఈట్రాకర్ డాష్ బోర్డును మానిటర్ చేయాలని సిఎస్ ఆదేశించారు. ఈసమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,ఎండి నెడ్ క్యాప్ కెవిఎన్.చక్రధరబాబు,పరిశ్రమల శాఖ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్,ఆశాఖ జెడి రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. (Story :ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ విధానంతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి) 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1