వరి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
పొలం పిలుస్తోంది కార్యక్రమం
(ఏ.డి.ఏ )బి.రవిబాబు ,ఏవో కె.అంజిరెడ్డి
న్యూస్ తెలుగు / వినుకొండ : మండలంలోని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఉప్పరపాలెం మరియు చట్రగడ్డపాడు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంను సబ్ డివిజన్ వ్యవసాయ అధికారి బి. రవిబాబు ,మండల వ్యవసాయ అధికారి కె అంజిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి, కంది,మిరప, పొగాకు పంటలను క్షేత్ర సందర్శన చేసి, రైతులతో సమావేశం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ. వరి పంటలో ఉల్లికోడు, కాండం తోలుచు పురుగు, రెల్లారాల్చు పురుగు మరియు పాము్పోడా తెగులు ఉధృతి ఉన్నట్లు గమనించారు. ఉల్లికోడు: వలన పిలక దశలో అంకురం ఉల్లికాడ వలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుందని, కంకి వెయ్యదు అని తెలిపారు. పిలక దశలో 5 శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి 1 కోడు సోకిన పిలక ఉన్న తీవ్రత స్థాయిలో ఉన్నట్లే అని, ఉల్లికోడు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉల్లికోడు. నివారణకు నాటిన 10 నుంచి 15 రోజులలోపు ఎకరానికి కార్బోప్యురాన్ 3జి 10 కిలోల గుళికలు వాడాలని తెలిపారు.
కాండం తొలుచు పురుగు : ఈ పురుగు నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశించి వరి పైరును నష్టపరుస్తుంది. నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది అని చెప్పారు. దిని నివారణకు నారు పీకటానికి వారం రోజుల ముందు 5 సెంట్ల(200చ. మీ.)నారుమడికి 800 గ్రా. కార్బోఫురాన్ 3 జి గుళికలను పలుచగా నిరుంచి చల్లి ఆ మడిలోనే ఇంకెటట్లు చేయాలి అని
అదే నాటే సమయంలో నారు కట్టల చివరలను త్రుంచి నాటుకోవాలి అని చెప్పారు.
రెల్లరాల్చు పురుగు: ఖరీఫ్ లో ఒకొక్కసారి ఈ పురుగు వరి పంటలకు తీవ్రనష్టం కలిగిస్తుంది. పగలు భూమిలో దాక్కుని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరించి వేస్తాయి అని. కత్తిరించిన కంకులు రాలిపోతాయి అని చెప్పారు దీని నివారణకు ఈనిక దశలో చ. మీ కు 4-5 పురుగులు గమనించిన వెంటనే మోనోక్రోటోఫాస్ 1.6 మీ. లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ. లీ లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచ్చకారి చేసి నివారించవచ్చు అని చెప్పారు. పొడ తెగులు ఆశించడం వలన ఆకులపై మచ్చలు పెద్దవై పాముపొడ మచ్చలుగా ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుందని, ఈ తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే రంగు మారిన లేదా తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గుతాయి అని తెలిపారు. పాముపొడ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 2మి.లీ లేదా ప్రోపికొనజోల్ 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం రైతులకు రబి సీజన్ కి సంబంధించి ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేపించుకోవాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ . ఖాదర్ బాషా ,ఏ . ఈ . ఓ సునీత సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు. (Story : వరి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి)