కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం సాగునీటిసంఘాల ఎన్నికలు
డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను అభినందించిన చీఫ్ విప్ జీవీ
న్యూస్‌తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ప్రస్తుతం వెలువడుతున్న సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, మరీ ముఖ్యంగా రైతుల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాలు కూటమి ఖాతాలోకే వచ్చాయని, ఇదే ఏకగ్రీవ స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నాయకులు, శ్రేణులకు ఆయన సూచించారు. వినుకొండ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభినందించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ పరిధిలోని 5 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు మంగళవారం వినుకొండ ఎన్నెస్పీ కాలనీలోని డీసీ భవన్‌లో ఎన్నిక జరిగింది. డీసీ-26 వినుకొండ ఛైర్మన్‌గా గడిపూడి వేణుగోపాల్, డీసీ-27 చీకటీగలపాలెం ఛైర్మన్‌గా ముత్తినేని ఏడుకొండలు, వైస్ ఛైర్మన్‌గా కామశెట్టి కొండలు, డీసీ-28 ఐనవోలు డీసీ ఛైర్మన్‌గా రావుల బుజ్జి, వైస్ ఛైర్మన్‌గా ఫణిదపు గాళేశ్వరరావు, డీసీ-29 త్రిపురాపురం ఛైర్మన్‌గా గంగినేని రాఘవరావు, వైస్ ఛైర్మన్‌గా మేదరమెట్ల శ్రీనివాసరావు, డీసీ-30 ములకలూరు ఛైర్మన్‌గా నక్కా బుల్లేశ్వరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా గోరంట్ల సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం డీసీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరిని జీవీ ఆంజనేయులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సాగునీటి రంగం, వ్యవసాయానికి తీసుకుంటున్న చర్యలు, రైతుల్లో కలిగిస్తున్న నమ్మకంతోనే ఇలాంటి ఏకపక్ష ఫలితాలు సాధించగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మీసాల మురళీయాదవ్, డీఎల్‌డీఏ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముండ్రు సుబ్బారావు, వంకాయలపాటి పేరయ్య, కాకాని వీరాంజనేయులు, నక్కా వీరారెడ్డి, పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం సాగునీటిసంఘాల ఎన్నికలు)