Home ఒపీనియన్‌  ‘స్వయంభూ’ నుంచి సుందర వల్లి న్యూ పోస్టర్ 

 ‘స్వయంభూ’ నుంచి సుందర వల్లి న్యూ పోస్టర్ 

0

 ‘స్వయంభూ’ నుంచి సుందర వల్లి న్యూ పోస్టర్ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హై బడ్జెట్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ కాన్వాస్‌పై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లు గా నటిస్తున్నారు.

తాజాగా నభా నటేష్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె క్యారెక్టర్ ని సుందర వల్లిగా పరిచయం చేస్తూ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నభా నటేష్ న్యూ పోస్టర్‌ లో రాయల్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా కనిపించారు. సుందర వల్లి పాత్రలో సాఫ్ట్ అండ్ ఛార్మింగ్ స్మైల్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్,  శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాకరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story :  ‘స్వయంభూ’ నుంచి సుందర వల్లి న్యూ పోస్టర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version