UA-35385725-1 UA-35385725-1

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ పై ప్రశంసలు కురిపించిన అమీర్ ఖాన్  

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ పై ప్రశంసలు కురిపించిన అమీర్ ఖాన్  

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా :సూపర్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజాUI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం, U/A సర్టిఫికేట్ అందుకుని డిసెంబర్ 20 న విడుదల కావడానికి రెడీ అయ్యింది.
UI The Movie కేవలం కన్నడ, తెలుగు సినీ వర్గాల్లోనే కాదు దేశమంతాట బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్‌ని చూసి ప్రశంసల జల్లు కురిపించారు.
“నేను ఉపేంద్ర గారికి వీరాభిమానిని, UI ది మూవీ ట్రైలర్ నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమా 20న విడుదలవుతోంది. ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతంగా చేశారు. ఇది భారీ హిట్ అవుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ట్రైలర్ చూడగానే షాక్ అయ్యాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.” అన్నారు అమీర్ ఖాన్.
అమీర్ మాటలు ఫిల్మ్ మేకర్ గా ఉపేంద్ర అసాధారణ ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాకుండా సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి.
అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, యూనిక్ కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. లీడ్ యాక్టర్ గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్ గా సినిమాని తీర్చిదిద్దారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన UI ది మూవీ రీజినల్, నేషనల్ ప్రేక్షకులపై బిగ్ ఇంపాక్ట్ ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రిలీజ్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి చెందిన గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇస్తుంది. (Story : సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ పై ప్రశంసలు కురిపించిన అమీర్ ఖాన్  )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1