శ్రీశైలం ముంపు బాధితులకు 50 శాతం ఉద్యోగాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : శ్రీశైలం ముంపు బాధితులకు చిరకాలంగా జరుగుతున్న అన్యాయంపై కే. డాగోజీరావు తండ్రి వెంకోజీరావు , ఇతరులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లు బిజెపి రాష్ట్ర నాయకులు బి దారాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరిగేషన్ శాఖలో లస్కర్ మరియు, హెల్పర్లుగా 1878 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున అట్టి పోస్టులలో 50 శాతం పోస్టులు తప్పనిసరిగా ముంపు ఇవ్వాలని కోరుతూ కోర్టు ఆర్డర్ కాపీని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి అందజేసినట్లు తెలిపారు. ముంపు బాధితులతో వచ్చి కలెక్టర్ ను కలిసి న్యాయం చేయమని కోరామన్నారు. కలెక్టర్ కూడా సుముకత వ్యక్తం చేసినట్టు తెలిపారు. 1986 లో వచ్చిన 98 జీవో, అలాగే2014 లో వచ్చిన 68 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మందికి ఇవ్వకపోవడంతో వారు అటు నాయకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ,ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి తనను కలిసినప్పుడు న్యాయ పోరాటం ద్వారానే న్యాయం జరుగుతుందని నచ్చచెప్పి రిట్ పిటిషన్ నెంబర్ 33017/ 2024 వేయించడం జరిగింది అన్నారు. తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేందుకు తనవంతుగా తోచిన ఈ సాయం చేశానని ధారాసింగ్ వివరించారు. భవిష్యత్తులో కూడా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని వారికి అభయం ఇచ్చారు. ముంపు బాధితులకు ప్రతి ఇంటికి 20 లక్షల ప్యాకేజీ ఇస్తూ 2013 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. (Story : శ్రీశైలం ముంపు బాధితులకు 50 శాతం ఉద్యోగాలు)