Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 318 కేజీల గంజాయి పట్టివేత

318 కేజీల గంజాయి పట్టివేత

0

318 కేజీల గంజాయి పట్టివేత

న్యూస్ తెలుగు/సాలూరు : 16 లక్షల విలువగల 318 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పార్వతీపురం ఎడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ అన్నారు. శుక్రవారం పాచిపెంట పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాచిపెంట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మతమూరు గ్రామం దగ్గర లో గల వేటగానివలస జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు నుండి సాలూరు రోడ్డు నుండి ఒక తెల్లని కారు నంబర్ ప్లేట్లు లేకుండా రావడంతో ఆ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది. కారును తనిఖీచేగా కారులో 9 బ్యాగుల తో గంజాయి కలిగి ఉన్నారు . ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా అందులో మొదటి వ్యక్తి మద్దాల వంశీ ఎస్ కోట చెందిన వ్యక్తి అయి ఉండి అతను ఆ కారుని డ్రైవ్ చేస్తూ వచ్చారు.అతనితోపాటు రెండో వ్యక్తి సోదర సుబ్బారావు జండా గురు గ్రామానికి చెందిన వ్యక్తి వీరిద్దరికి శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ ఎస్.కోట అనే వ్యక్తి పాడేరు, పెదబయలు ఏరియాలో గంజాయిని బాలు అనే వ్యక్తి వద్ద నుండి కొనడం జరిగింది గంజాయిని కొని కార్ లో లోడ్ చేసుకొని అరకు సాలూరు రోడ్డు లోతేరు మీదగా వస్తున్నట్లు సమాచారం వచ్చింది. మాతమూరు జంక్షన్ వద్ద కారు తనిఖీ చేసి చూడగా వీరు పట్టుబడినారు. ఆ కారులో మొత్తం తొమ్మిది బ్యాగుల్లో సుమారు 318 కేజీలు గంజాయి 16 లక్షలు విలువ కలిగి ఉంది. గంజాయిని ఉమామహేశ్వరరావు విజయనగరం హైవేలో రాజస్థాన్ కు చెందిన లారీల్లో లోడ్ చేసి వరంగల్ మీదుగా వెళుతున్నట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు పై గతంలో విశాఖపట్నం ఎస్ కోట ఏరియాల్లో కన్యా కేసులు ఉన్నాయి. గంజాయి, కారు, రెండు సెల్ ఫోను సీజ్ చేయడం జరిగింది. నిందితులపై. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ P రామకృష్ణ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్B అప్పలనాయుడు పాచిపెంట ఎస్సైK V సురేష్ సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : 318 కేజీల గంజాయి పట్టివేత  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version