UA-35385725-1 UA-35385725-1

పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది!

పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది!

మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు
17 నుంచి పది ప్రారంభం
మంత్రి లోకేశ్‌ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు శుభాకాంక్షలు

న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ మార్చి-2025, పదో తరగతి పరీక్షల షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది(2025) మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి (రెగ్యులర్‌/ప్రైవేట్‌) పరీక్షలను నిర్వహిస్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా బుధవారం షెడ్యూలును విడుదల చేసి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతాయి. మొత్తం 9 రోజులపాటు పరీక్ష లు ఉంటాయి.
మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్‌ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

టెన్త్ పరీక్షల షెడ్యూలు ఇలా…

తేదీ సబ్జెక్ట్‌

మార్చి 17 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 19 : సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 21 : ఇంగ్లీషు

మార్చి 22 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

మార్చి 24. : గణితం

మార్చి 26 : ఫిజికల్‌ సైన్స్‌

మార్చి 28. : బయోలాజికల్‌ సైన్స్‌

మార్చి 29. : ఓఎస్‌ఎస్‌సి మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2,

ఒకేషన్‌ కోర్స్‌ (థియరీ)

మార్చి 31 : సోషల్‌ స్టడీస్‌

“““““

ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షల షెడ్యూలు ఇలా..

మార్చి 1న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`1, 4న ఇంగ్లీషు, 6న మేథమేటిక్స్‌ పేపర్‌-1ఏ, బోటనీ, సివిక్స్‌ పరీక్షలు జరుగుతాయి. 8న మేథమేటిక్స్‌ పేపర్‌`1(బి), జువాలజీ, హిస్టరీ, 11న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, 13న కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. 17న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌ పేపర్‌, బ్రిడ్జి కోర్స్‌ మేథమేటిక్స్‌ (బైపీసీ విద్యార్థుల కోసం), 19న మోడ్రన్‌ లాంగ్వేజీ, జాగ్రఫీ పరీక్షలు ఉంటాయి.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూలు ఇలా

మార్చి 3వ తేదీన 2న లాంగ్వేజ్‌ పేపర్‌`2, 5న ఇంగ్లీషు, 7వ తేదీన మేథమేటిక్స్‌ పేపర్‌`2(ఏ), బోటనీ, సివిక్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 10న మేథమేటిక్స్‌`2బి, జువాలజీ, హిస్టరీ, 12న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు కొనసాగుతాయి. 15న కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, 18వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌ పేపర్‌, మేథమేటిక్స్‌ పేపర్‌`2 బ్రిడ్సి కోర్సు( బైసీపీ విద్యార్థుల కోసం), 20వ తేదీన మోడ్రన్‌ లాంగ్వేజీ, జాగ్రఫీ పరీక్షలను నిర్వహిస్తారు. (Story: పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది!)

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1