అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్ తెలుగు/విజయనగరం : నేరాలను నియంత్రించుటలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా జిల్లా ఎస్పీవకుల్ జిందల్ తెలిపారు. ఇందుకుగాను అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి, దాడులను విస్తృతం చేసామన్నారు.సహేతుకరమైన కారణం లేకుండా రాత్రి 11గంటలు తరువాత బయట తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. కారణం లేకుండా రాత్రి సమయాల్లో అనుమానస్పదంగా సంచరించే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నామని, వారిని పోలీసు స్టేషనులకు తరలించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగు నిర్వహించి పంపుతున్నామన్నారు. పేకాట, కోడి పందాలు నిర్వహించే వారిపై నిఘా పెట్టామని, ముందస్తు సమాచారాన్ని సేకరించి, వారిపై దాడులను విస్తృతం చేసామన్నారు. అనధికారంగా మద్యం విక్రయాలు చేపట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ, వారిపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగు నిర్వహిస్తూ, వాహన తనిఖీలు చేపడుతూ, పశువులను అక్రమంగా తరలించే వారిపైన, ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా ఉపేక్షించేది లేదని, వారిపై కేసులు హెచ్చరించారు.గత వారం రోజుల్లో పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి, 56 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుండి రూ.86,134/- ల నగదు, 5 కోడి పుంజలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా అనధికారంగా మద్యం కలిగిన వారిపై 14 కేసులు నమోదు చేసి, 14మందిని అరెస్టు చేసి, 382 మద్యం బాటిళ్ళు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసామన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతూ మోటారు వాహన చట్టం అతిక్రమించిన వారిపై 3,756 ఈ చలానాలను విధించామన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై 7 కేసులు నమోదు చేసి, 10 మందిని అరెస్టు చేసి, 67 పశువులను, 7 వాహనాలను సీజ్ చేసామన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిపై 179 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న వారిపై 459 కేసులు, అర్ధ రాత్రుళ్ళు సహేతుకరమైన కారణాలు లేకుండా బలాదురుగా తిరిగిన వారిపై 254 కేసులు నమోదు చేసామని తెలిపారు.(Story : అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం )