కరాటే లో శ్రీ చైతన్య విద్యార్థినికి ఉత్తమ బహుమతి
న్యూస్ తెలుగు/విజయనగరం : శ్రీ చైతన్య విద్యాసంస్థ నిరంతరం విద్యతో పాటు ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని అందులో భాగంగానే కరాటే లో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచేందుకు విద్యార్థినీ విద్యార్థులకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తున్నామని శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రాంతీయ పర్యవేక్షకులు వి. శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రింగ్ రోడ్ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న గేదెల తన్మయశ్రీ కి విజయనగరం కరాటే అసోసియేషన్ లో జరిగిన ఇండివిద్యువల్ ఛాంపియన్షిప్ లో రెండు ఉత్తమ బహుమతులను గెలుచుకున్నదని కోచ్ తాతారావు ను అభినందిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ బాబు తెలియజేశారు. ఇంతటి ప్రతిభను కనబరిచిన విద్యార్థినిని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విక్రమ్, పాఠశాల పీఈటీలు పాఠశాల డీన్లు సూర్యచంద్ర, సత్యనారాయణ, చిన్నం నాయుడు అభినందిస్తూ ఈ విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.(Story : కరాటే లో శ్రీ చైతన్య విద్యార్థినికి ఉత్తమ బహుమతి)