Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కూట‌మి ప్ర‌భుత్వంలో  విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు

కూట‌మి ప్ర‌భుత్వంలో  విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు

0

కూట‌మి ప్ర‌భుత్వంలో  విద్యారంగంలో

విప్లవాత్మకమైన మార్పు

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు శనివారం మెగా పేరెంట్ మీటింగ్ సభ కు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జివి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యారంగంలో మంచి మార్పులు తెచ్చా రన్నారు. గతంలో అమ్మ ఒడి సక్రమంగా అందకపోగా ఆ పథకం అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. నేటి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 15000 అమలు చేస్తున్నదని ఇందుకుగాను 6,845 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్నీ అస్తవ్యస్తంగా మారాయి అన్నారు. అన్ని కళాశాలల్లో గంజాయి సంస్కృతి పెరిగిపోయింది అన్నారు. నేటి ప్రభుత్వం దానిపై కఠినంగా వ్యవహరిస్తున్నదని జివి అన్నారు. పాఠశాల నూతన భవనాలకు ఇటీవల బడ్జెట్లో 38వేల 825 కోట్లు కేటాయించినట్లు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. అలాగే డీఎస్సీ ద్వారా 16 వేల 437 కొత్త టీచర్ పోస్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గోతులు పడి ప్రజలు పలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారని రోడ్లు మరమ్మత్తులు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది అన్నారు. విద్యార్థులు దుర అలవాట్లుకు దూరంగా ఉండి విలువలతో కూడిన విద్యతో అలాగే ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు ఎంతో ముందుచూపుతో వినూత్నంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల యందు ఇటువంటి మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తూ పాఠశాలల స్థితిగతులను మెరుగుపడాలని ఎంతో కృషి చేస్తున్నారని, అలానే రాష్ట్రంలో విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, అలానే తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల అప్రమత్తతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి.హవీలా దివ్యాంగులైన ఇద్దరు విద్యార్థులకు తమ సొంత ఖర్చులతో ట్రై సైకిల్ లను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లుల చేత ముగ్గుల పోటీలు నిర్వహించారు. తండ్రులచే ( టగ్గ ఆఫ్ వార్) ఆటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శోభన్ బాబు విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతు దుర అలవాట్లుకు బానిసలు కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి వై.యేసు బాబు, ఎఫ్ఏసి డిప్యూటీ డిఇఓ మరియు వినుకొండ ఎంఈఓ సయ్యద్ జఫ్ఫుల్ల, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పి. విజయలక్ష్మి, వైస్ చైర్మన్ ఎం.లక్ష్మీనారాయణ, వార్డు కౌన్సిలర్ పత్తి పూర్ణ, ఆయూబ్ ఖాన్, సౌదాగర్ జానీ భాష, షమీంఖాన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సభలో వివిధ గేమ్స్ నందు గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. (story  : కూట‌మి ప్ర‌భుత్వంలో  విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version