Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మౌలానా అబుల్ కలాం అజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు కల్పించండి

మౌలానా అబుల్ కలాం అజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు కల్పించండి

0

మౌలానా అబుల్ కలాం అజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు కల్పించండి

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగర్ ( మసీద్ మాన్యం) లో గత 18 సంవత్సరాలుగా స్థిర నివాసములు ఏర్పరచుకొని నివసిస్తున్న పేద ప్రజలకు మౌలిక వసతులు మంచి నీటి వసతి, కరెంటు సౌకర్యం, రోడ్లు, సైడ్ కాలువలు తదితర వసతులు కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా లు కోరారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ షేక్ దస్తగిరి ని వారి స్వగృహంలో కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ. గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు మంచినీళ్లు అందకుండా ఆపివేసి అనేక దఫాలుగా కరెంటును కాలనీ కి రాకుండా నిలుపుదల చేయించి, మోకాళ్ళ లోతు గుంతల రోడ్లు తో ఉన్నను పట్టించుకొనక వృద్ధులు మహిళలు చదువుకొను చిన్నపిల్లలకు మరియు అచ్చటి ప్రజలను పలు రకాలుగా నరకయాతన పెట్టారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆజాద్ నగర్ కాలనీ ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించి వారి ప్రశాంత జీవనానికి తోడ్పడవలసిందిగా కోరారు. మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరిని కలిసిన వారిలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు,వూట్ల రామారావు, కొప్పరపు మల్లికార్జున రావు తదితరులు పాల్గొని పట్టణంలోని ప్రజా సమస్యలపై మాట్లాడి సమస్యలను పరిష్కరించమని కోరారు.(Story : మౌలానా అబుల్ కలాం అజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు కల్పించండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version