వినుకొండ ఎన్ఎస్పి కాలువ రోడ్లు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణం మీదుగా వెళ్తున్న పెరుమాళ్లపల్లె కాలువ ఇరువైపు రహదారులపై ప్రజా భద్రతను నిర్ధారించడానికి మరియు సంభావ్య ప్రమాదాలను నిరోధించడానికి రాకపోకలకు ⁰అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశం మేరకు వినుకొండ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. ఎన్‌ఎస్‌పి కాలువ పరిసరాల పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సుందరంగా ఆహ్లాదంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, కానీ కేవలం ఇరవై అడుగుల వెడల్పాటి రోడ్లపై ఇరువైపులా వాహనములు నిలిపి ఉంచడం వలన అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు అందువల్ల వాహనాలను ఎన్‌ఎస్‌పి కెనాల్ రోడ్‌లో పార్కింగ్ చేయడం వల్ల ఉత్పన్నమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసు శాఖ అధికారుల సహకారం తీసుకొని వాహనములను సీజ్ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమీషనర్ హెచ్చరించారు. (Story : వినుకొండ ఎన్ఎస్పి కాలువ రోడ్లు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్)