నూతన ఇంద్ర బస్సులను సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఏపీఎస్ఆర్టీసీ డిపోలో గతంలో ఉన్న పాత ఇంద్ర బస్సుల స్థానంలో నూతన హంగులతో ఇప్పుడు కొత్త ఇంద్ర బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ జే. నాగేశ్వరరావు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ప్రజలు గమనించి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ కౌంటర్ వద్ద రిజర్వేషన్ చేయించుకోవలసినదిగా ఒక ప్రకటనలో తెలిపారు.(Story : నూతన ఇంద్ర బస్సులను సద్వినియోగం చేసుకోండి)