ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి
న్యూస్ తెలుగు /సాలూరు : ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నడానికి ఆ మహానుభావుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో గల 4 వ వార్డ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ అనే మహానుభావుడు లేకపోతే బడుగు బలహీనవర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి)